స్బి ఫిక్స్డ్ డిపాజిట్ ఇంటరెస్ట్ రేట్స్ ౨౦౧౮ 2019

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)..ఎంపిక చేసిన డిపాజిట్లపై వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే. పెంచిన కొత్త వడ్డీరేట్లు బుధవారం (నవంబరు 28) నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో 0.10 శాతం పెరిగిన వడ్డీరేటు 6.80 శాతానికి చేరుకుంది. ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.5 శాతం మేర పెంచగా, ఐసీఐసీఐ బ్యాంక్ పావు శాతం సవరించింది.

కొత్త వడ్డీరేట్లు ఇలా..

  • కోటి రూపాయల లోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను ఎస్‌బీఐ 5 -10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.
  • ఏడాది నుంచి రెండేళ్లలోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు 6.70 శాతం నుంచి 6.80 శాతానికి చేరుకుంది.
  • వయో వృద్ధులకు చెల్లించే వడ్డీరేటును 7.20 శాతం నుంచి 7.30 శాతానికి సవరించింది.
  • 2 – 3 ఏళ్లలోపు డిపాజిట్లపై వడ్డీ 6.75 శాతం నుంచి 6.80 శాతాని చేరింది. ఈ విభాగంలో వయో వృద్ధులకు ఇచ్చే స్థిర డిపాజిట్‌ రేటు 7.25 శాతం నుంచి 7.30 శాతానికి పెరిగింది.

Check Latest FD Rates of State Bank of India